ఈపురుపాలెంలో దళిత మహిళలపై మూకుమ్మడి దాడి!
భూమి వివాదంలో 10 మందిపై ఆరోపణలు.. ఇద్దరికి గాయాలు చీరాల, అక్టోబరు 8: చీరాల మండలం ఈపురుపాలెం ఆటోనగర్ సమీపంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భూమిలో పనులు చేసుకుంటున్న ఇద్దరు దళిత మహిళలపై బాపట్ల నుంచి వచ్చిన సుమారు 10 మంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో గాయపడిన మహిళలకు చీరాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపారు. తాము సుమారు 30 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నామని బాధితులు పేర్కొన్నారు. దాడి...