నందిగుంటపాలెంలో పోలీసుల పల్లెనిద్ర

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన కారంచేడు, అక్టోబర్ 16 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కారంచేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందిగుంటపాలెం గ్రామంలో ఇంకొల్లు సీఐ రామనాయక్, కారంచేడు ఎస్సై పి.గోపి ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన పోలీసులు గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా...