కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం
విద్యార్థుల ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరం చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి జాతీయ స్థాయి కరాటే విజేతలకు ఘన సత్కారం మండల విద్యాశాఖాధికారి టీ. మల్లేశ్వరరావు గంగవరం, అక్టోబర్ 12 (పెన్ పవర్): విద్యార్థులు చిన్నతనం నుంచే కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలను అభ్యసించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని గంగవరం మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) టీ. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో కూడిన కరాటే సాధన విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆదివారం గంగవరం...