మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు గంగవరం, అక్టోబర్ 19 (పెన్ పవర్): గంగవరం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పురోహితులు శ్రీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మహిషాసుర మర్దిని రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు...