రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక
కారంచేడు, అక్టోబర్ 8: కుంకలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బుసి లోకేష్ రాష్ట్రస్థాయి అండర్-17 వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన లోకేష్, ఈనెల 8 నుంచి 10 వరకు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నాడు. విద్యార్థిని పీడీ కే. ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.