పోలవరం జిల్లా ఎస్పీ ఎదుట ముగ్గురు ఏసీఎం స్థాయి మావోయిస్టుల లొంగుబాటు
రంపచోడవరం, పెన్ పవర్ అక్టోబర్ 27: పోలవరం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యల నేపథ్యంలో చింతూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఐపీఎస్ ఎదుట ముగ్గురు ఏరియా కమిటీ సభ్యుల (ఏసీఎం) స్థాయి మావోయిస్టులు మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మాడవి కోయింగ్ అలియాస్ రజని, హేమల హెడ్మా అలియాస్ దీపక్, గజరాజు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొవ్వాసి జోగి అలియాస్ గంగి ఉన్నారు. పలు ఎన్కౌంటర్లలో...