నెల్లిపూడిలో వీధి దీపాల సమస్యను పరిష్కరించాలి

పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు! వీధి దీపాలు వెలగక రాత్రివేళల్లో గ్రామస్థుల అవస్థలు చీకటి కారణంగా దొంగతనాల భయం.. ప్రజల్లో ఆందోళన తక్షణమే చర్యలు చేపట్టాలి: టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు ముచ్చకర్ల శివప్రసాద్ గంగవరం, అక్టోబర్ 13 (పెన్ పవర్): గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో నెలకొన్న వీధి దీపాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రంపచోడవరం నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు ముచ్చకర్ల శివప్రసాద్ డిమాండ్ చేశారు. గ్రామంలో వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...