Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లివైసిపి తరపున గెలిచిన ఏకైక కౌన్సిలర్ కరణం అమ్మాజీ

వైసిపి తరపున గెలిచిన ఏకైక కౌన్సిలర్ కరణం అమ్మాజీ

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఏడవ వార్డు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరణం అమ్మాజీ 62 ఓట్ల తేడాతో విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి వరుసగా టిడిపి హవా నడుస్తున్న సమయంలో ఎడారిలో ఒయాసిస్ లా ఈ విజయం దక్కింది. ఒక దశలో సీనియర్ వైసీపీ నాయకులందరూ ఓటమి పాలవుతుండడంతో టిడిపి క్లీన్ స్లీప్ చేసేటట్లు అనిపించింది. ఆ సమయంలో ఏడవ వార్డులో వైసీపీ జెండా ఎగిరింది. టిడిపి అభ్యర్థి కొడుకుల లీలావతి 450 ఓట్లు సాధించగా, వైసిపి అభ్యర్థి కరణం అమ్మాజీకి 512 ఓట్లు వచ్చాయి. 62 ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి కరణం అమ్మాజీ విజయం సాధించి, మున్సిపాలిటీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular