అధిక వడ్డీతో వేధింపులు.. ఏడుగురు అరెస్ట్‌.

రూ.70 వేల అప్పు.. రూ.4 లక్షల వసూలు! అధిక వడ్డీతో వేధింపులు.. ఏడుగురు అరెస్ట్‌ ఎల్బీనగర్, పెన్ పవర్ నవంబర్ 05: అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలకు రుణాలిస్తూ, అప్పులు చెల్లించలేని వారిని బెదిరింపులకు గురిచేస్తున్న అక్రమ ఫైనాన్స్‌ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్‌వోటీ ఎల్బీనగర్‌ జోన్‌, ఎల్బీనగర్‌ పోలీసులు సంయుక్తంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటికే ముగ్గురు అరెస్టు కాగా, తాజా అరెస్టులతో ఈ కేసులో పట్టుబడిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరో నలుగురు పరారీలో ఉన్నారు....