అభివృద్ధికి అండగా ఉంటా.. ఆశీర్వదించండి:రింతాడ ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి కంకిపాటి ప్రసాద్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 2:వైఎస్సార్‌సీపీ రింతాడ పంచాయతీ సెగ్మెంట్–1 ఎంపీటీసీ అభ్యర్థి కంకిపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇంద్రనగర్, కొత్తూరు, కడుగుల ఊబల, రింతాడ తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.