ఆర్యవటంలో హోరాహోరీ పోరు యువత రాజకీయ అరంగేట్రం..
సర్పంచ్ పీఠంపై కన్ను! బాబి వర్సెస్ అజయ్ కృష్ణ.. ప్రచారంలో హోరెత్తుతున్న రాజకీయ వేడి కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 26:కాజులూరు మండల పరిధిలోని ఆర్యవటం గ్రామ పంచాయతీ ఎన్నికలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు యువ అభ్యర్థులు వ్యూహప్రతివ్యూహాలతో ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం యువ నాయకులు చందాల వీరవెంకట సత్యనారాయణ (బాబి), వనుం అజయ్ కృష్ణ మధ్యే నెలకొంది. ఇద్దరూ యువకులే కావడంతో ఈ ఎన్నికలు గ్రామ రాజకీయాల్లో...