ఎంపీపీ పీఠం ఎవరి సొంతం? జీకేవీధిలో ఉత్కంఠ!
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 19: జీకేవీధి మండల ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ మండలంలో నెలకొంది. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుని ఎంపీపీ పదవికి అవసరమైన మెజారిటీ సాధించింది. అయితే ఎంపీపీ పదవిని ఆశిస్తున్న అదే పార్టీకి చెందిన జీకేవీధి-3 ఎంపీటీసీ లక్ష్మణ్, జీకేవీధి-1 ఎంపీటీసీ లీలాప్రసాద్ మధ్య పోటీ నెలకొంది. ఇరువురూ ఎంపీటీసీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి...