కాజులూరు మండలంలో హోరాహోరీగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
రెండు రోజుల్లో 322 నామినేషన్లు దాఖలు.. శలపాకలో టేకుమూడి భాగ్యలక్ష్మి, తణుకువాడలో పితాని పద్మావతి బరిలోకి కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 19: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కాజులూరు మండలంలో రాజకీయ వేడిని రాజేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. మండలంలోని 26 గ్రామపంచాయతీల పరిధిలో రెండు రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండో రోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరగడంతో ఆశావహుల్లో ఉత్సాహం...