కోలంకలో భారీ అగ్నిప్రమాదం.. రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం
కాజులూరు, పెన్ పవర్,నవంబర్ 11: కాజులూరు మండలం కోలంక గ్రామంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మాజీ ఎంపీటీసీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ తొగరు చంద్రశేఖర్‌బాబుకు చెందిన రైస్‌మిల్లులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పీచు ఫ్యాక్టరీకి వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో రైస్‌మిల్లులో బియ్యం ఆడించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 500 ధాన్యం బస్తాలు, పీచు ఫ్యాక్టరీలోని ముడిసరుకు, ఎగుమతికి సిద్ధంగా ఉంచిన పీచు సామగ్రి, సుమారు 1,300 పీచు బేళ్లు, ఎలివేటర్, మోటార్లు, గోడౌన్లు...