గార్లకు చేరిన వేంకటేశ్వరస్వామి
స్వామి దర్శన భాగ్యంతో పులకించిన భక్తులు గార్ల, పెన్ పవర్, నవంబర్: 1 గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవాలను ముగించుకొని ఆదివారం రాత్రి గార్లకు చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి గోదాదేవి సమేత ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి మేళతాళాల నడుమ గార్ల పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారిని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దంపతులు పార్వతీహతిరం నాయక్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయానికి చేర్చారు. ఊరేగింపులో...