గొలుసు గుర్తుపై ఓటేసి గెలిపించండి: పసుపులేటి నాగమణి
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 23:గూడెంకొత్తవీధి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పసుపులేటి నాగమణి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ పరిధిలోని టంగుళ్లగొంది, పామురాయి, కంపుమానుపాకలు, అద్దరవీధి, పాతవీధి, బొడ్డమానుపాకలు గ్రామాల్లో ఆమె పర్యటించి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన గొలుసు గుర్తుపై ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.