గ్రామాల ప్రగతికి బాటలు వేస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి: బొబ్బిలి లక్ష్మణ్

గూడెంకొత్తవీధి, నవంబర్ 2 (పెన్ పవర్):గూడెంకొత్తవీధి సెగ్మెంట్-3 ఎంపీటీసీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్ ఆదివారం ఆర్.వి.నగర్ పరిధిలోని మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల ప్రగతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.  ...