జగన్నాథగిరిలో ద్విముఖ పోరు..
ప్రజాసేవ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా అభ్యర్థుల హామీలు కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని జగన్నాథగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవికి పెమ్మనబోయిన కృష్ణ, కాకర్లపూడి గాంధీరాజు పోటీ పడుతుండటంతో గ్రామంలో ద్విముఖ పోటీ నెలకొంది. పార్టీలకు అతీతంగా గ్రామంలోని పలువురు నాయకులు, ప్రజలు తనకు మద్దతు తెలిపి సర్పంచ్‌గా పోటీ చేయాలని ప్రోత్సహించడంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు పెమ్మనబోయిన కృష్ణ తెలిపారు. గ్రామ నాయకుల సహకారం, ప్రజల అండదండలతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని...