దామనపల్లిలో వైసీపీ అభ్యర్థిత్వంపై వివాదం..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 23:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థిగా వంతల కాసులమ్మను పార్టీ అధిష్టానం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ పేరు, జెండాలను ఉపయోగించి ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదని చంటిబాబు కోరారు.గతంలో గొడుగుమామిడి నుంచి విజయ్ పోటీ చేసిన సందర్భంలో ఇదే అంశంపై నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇవి పార్టీ గుర్తులేని ఎన్నికలని, ఎవరైనా పోటీ చేయవచ్చనే వాదనలున్నప్పటికీ, పార్టీ...