దామనపల్లి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సాగిన సత్యవతి విస్తృత ప్రచారం!
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 1: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సాగిన సత్యవతి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డేగలపాలెం, దామనపల్లి తదితర గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్తిబాబు, అరకు ఇర్మియా తదితరులు పాల్గొన్నారు.