దామనాపల్లి పంచాయతీలో 11 గంటలకే 62 శాతం పోలింగ్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 26:గూడెంకొత్తవీధి మండలంలోని దామనాపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటల సమయానికి పంచాయతీలో 62 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా, ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.