దామనాపల్లి సర్పంచ్ పీఠంపై మాజీ సర్పంచ్ గురి! టికెట్ కోసం ఆశావాహుల ప్రయత్నాలు!
గూడెంకొత్తవీధి, పెన్ పవర్,నవంబర్ 13: దామనాపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసిన మాజీ సర్పంచ్ కుందేరి రామకృష్ణ ఈసారి ఎస్టీ మహిళకు స్థానం రిజర్వు కావడంతో తన కుటుంబానికి చెందిన మహిళను బరిలోకి దింపే ప్రయత్నంలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు దొడ్డికొండకు చెందిన వంతల చంటిబాబు కుటుంబ సభ్యులు కూడా సర్పంచ్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో స్వతంత్రంగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మరో సామాజిక వర్గం...