దుగ్గుదుర్రులో తగ్గేదేలే.. నువ్వా నేనా!
కురుపూడి కొండ.. కట్టా అప్పారావు మధ్య హోరాహోరీ పోరు – గెలుపుపై ఇద్దరూ ధీమా.. ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కాజులూరు, పెన్పవర్, నవంబర్ 27: కాజులూరు మండల పరిధిలోని దుగ్గుదుర్రు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న కురుపూడి గోవిందరాజు (కొండ), కట్టా అప్పారావు మధ్యే నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు తమకున్న ప్రజాబలం, గతంలో చేసిన సేవలు, రాజకీయ అనుభవమే విజయానికి బాటలు వేస్తాయని ధీమా...