పల్లిపాలెం సర్పంచ్ బరిలో పంపన నాగమణి
అభివృద్ధి హామీలతో ముమ్మర ప్రచారం కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని పల్లిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పంపన నాగమణి బరిలో నిలిచారు. వైసీపీ నేతలు బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నాయకులు కాజులూరి సిద్ధార్థరెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీను తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు నాగమణి తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న బస్సు సౌకర్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి...