పసుపులేటి నాగమణి విస్తృత ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 3:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్న అగ్రహారం గ్రామంలో పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. జీకేవీధి-2 సెగ్మెంట్ కూటమి అభ్యర్థి పసుపులేటి చైతన్య వర్మకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.