పెదవలసలో కూటమి అభ్యర్థి సప్పగడ్డ కుమారి విస్తృత ప్రచారం
గూడెంకొత్తవీధి, పెన్ పవర్,నవంబర్ 3:మండలంలోని పెదవలస పంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి సప్పగడ్డ కుమారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని రాంపుల, కోకితపాడు, డోకూలూరు, చాపరాతిపాలెం తదితర గ్రామాల్లో పర్యటిస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ చేపట్టి ఓటర్లను కలుసుకున్నారు.ఈ సందర్భంగా సప్పగడ్డ కుమారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రచారంలో కూటమి...