ప్రజాసేవే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థి మోహనరావు ప్రచారం!

గూడెం కొత్త వీధి పెన్ పవర్ నవంబర్ 1: జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి, ఉపాధ్యాయుడు కంకిపాటి మోహనరావు మండలంలోని చిన్న జడుమూరు, కొత్తూరు, కోరాపల్లి, నిమ్మలపాలెం, సిరిబాల, సామగడ్డ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన అనుభవంతో, ప్రజా సమస్యల పరిష్కారానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచానన్నారు. తనకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.