మొండిగెడ్డ అభివృద్ధికి మరోసారి ఆశీర్వదించండి: అడపా ప్రియాంక

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 23:మొండిగెడ్డ పంచాయతీ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అడపా ప్రియాంక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత పదవీకాలంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.