రింతాడ సర్పంచ్ అభ్యర్థి కొయ్యం సిద్ధుకు ఉంగరం గుర్తు కేటాయింపు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 21: గూడెంకొత్తవీధి మండలం రింతాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొయ్యం సిద్ధు (ఇమ్మానియేల్)కు ఎన్నికల అధికారులు ఉంగరం గుర్తును కేటాయించారు. ఈ మేరకు ఎన్నికల గుర్తు కేటాయింపు ప్రక్రియలో ఆయనకు ఉంగరం గుర్తు లభించింది.