లక్కవరపేటలో కూటమి అభ్యర్థి బోండ్ల తలుపులమ్మ ముమ్మర ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 3:మండలంలోని లక్కవరపేట పంచాయతీ పరిధిలో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి బోండ్ల తలుపులమ్మ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటూ, కమలం గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు బోండ్ల చిరంజీవి, బోండ్ల రాజ్‌కుమార్‌తో పాటు జనసేన నాయకులు, కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.