18 గ్రామాల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం:వంచుల పంచాయతీ జనసేన అభ్యర్థి పాంగి శ్రీను

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 18:వంచుల పంచాయతీ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తానని జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న పాంగి శ్రీను పేర్కొన్నారు. 2022 నుంచి జనసేన పార్టీ వంచుల పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నానని తెలిపారు.పంచాయతీ పరిధిలోని 18 గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, ముఖ్యంగా మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం తన ప్రధాన అజెండా అని వెల్లడించారు. ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు...