నవంబర్ 3 సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగింపు
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ రంపచోడవరం, నవంబర్ 2: పోలవరం జిల్లాలో 12 జెడ్పీటీసీ, 101 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని సోమవారం వెల్లడించారు. ప్రచార సభలు, ర్యాలీలు, వాహనాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి పొందిన అనుమతులు కూడా అదే తేదీతో ముగుస్తాయని స్పష్టం చేశారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి...