రాజవొమ్మంగి మండలంలో 19 పంచాయతీలకు సర్పంచుల ఎన్నిక
గంగవరం /రాజవొమ్మంగి పెన్ పవర్ నవంబర్ 26: రాజవొమ్మంగి మండలంలో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 19 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మద్దతు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. విజయం సాధించిన వారిలో రాజవొమ్మంగి నుంచి కనిగిరి దుర్గాప్రసాద్, బద్రవాంపల్లి నుంచి కిసవర్తి రాజబాబు, శరభవరం నుంచి లోతా రాజులక్ష్మి, దూసరపాము నుంచి కనిగిరి లక్ష్మీదుర్గ, తంటికొండ నుంచి కొంగర సావిత్రి, కిర్రాబు నుంచి...