ఆ ప్రాజెక్ట్ కి ఎమ్మార్వో “కింగ్ మేకర్” అంటా..?

పెన్ పవర్ ఎక్స్‌క్లూజివ్ | ఎపిసోడ్–2 వెళ్లిపోయిన ఎమ్మార్వోను మళ్లీ రప్పించిన అసలు కారణమేంటి? సునీల్ పునర్నియామకం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? బదిలీ అయి వెళ్లిన అధికారిని అదే స్థానానికి తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? తహసీల్దార్ కార్యాలయంలో చాపకింద నీరులా సాగుతున్న వ్యవహారాలేంటి? సునీల్‌ను తిరిగి రప్పించడం వెనుక ఏదైనా ప్రత్యేక ప్రాజెక్టు ఉందా? ఆయన కోసం అనుకున్న పని పూర్తయిందా.. లేక ఇంకా కొనసాగుతోందా? కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందిలో అసంతృప్తి.. ఆందోళనకు సిద్ధమవుతున్నారన్న ప్రచారంలో నిజమెంత? తహసీల్దార్ గదిలోకి వెళ్లాలంటే...