దేశాయిపేట సర్పంచి అభ్యర్థిగా మార్పు నళిని

టీడీపీ అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆమోదం చీరాల, నవంబరు 11 : దేశాయిపేట గ్రామ సర్పంచి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మార్పు దావీదు సతీమణి మార్పు నళినిని ఖరారు చేస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మార్పు నళిని మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను తెలుసుకుని సంబంధిత అధికారుల సహకారంతో...