నవంబర్ 5న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

  ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలి: కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, నవంబర్ 3: పోలవరం జిల్లాలో నవంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న పోలింగ్ జరగనుందని...