దేవాంగపురి–3లో సిద్ధి సునీతకు ఘన విజయం.. టీడీపీకి ప్రజల పట్టాభిషేకం
చీరాల, నవంబరు 7 : దేవాంగపురి–3 ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సిద్ధి సునీత విజయదుందుభి మోగించారు. తన సమీప ప్రత్యర్థిపై 600కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి టీడీపీ జెండాను ఎగురవేశారు. ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు సతీమణి అయిన ఆమెకు ఓటర్లు ఘన విజయాన్ని అందించారు. విజయం అనంతరం సిద్ధి సునీత మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఆదరించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా, తనను నమ్మి అండగా...