చీరాల నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

వేటపాలెం : చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గ పరిధిలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కమిటీ సమన్వయకర్త, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త లక్ష్మీ కళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీరాల అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్...