బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు

పోలవరం జిల్లా ఎస్ పీ చక్రవర్తి రంపచోడవరం, (పోలవరం బ్యూరో) నవంబర్ 2: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి తెలిపారు. సోమవారం రంపచోడవరం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. బ్యాలెట్...