గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 2: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం జీకే వీధి పంచాయతీకి చెందిన టంగుల గొంది రోడ్డు గురువారం కురిసిన వర్షానికి చిధ్రమైంది.ఈ రోడ్డు నిర్మించి ఎంతో కాలం కాలేదని, అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల అడ్డదిడ్డంగా రోడ్డు పనులు పూర్తి చేశారని, దీంతో వర్షం వస్తే రోడ్లు కోతకు గురి అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చిద్రమైన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వర్షానికి ఛిద్రమైన టంగుల గొంది రోడ్డు
అల్లూరి జిల్లా సమస్యలు