రెండు కేసుల్లో 62 కేజీల గంజాయి పట్టివేత

మోతుగూడెం

 

డొంకరాయి ఎస్సై శివ కుమార్, తన సిబ్బందితో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డొంకరాయి పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద వై రామవరం డిప్యూటీ తహశీల్దార్ సుధాకర రావు, వి ఆర్ ఓ సందీపాచార్యులు ఆధ్వర్యంలో బుధవారం  మధ్యాహ్నాం నుండి సాయంత్రం వరకూ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల కి చెందిన పెనుమల బాబూ, పర్వతం సురేష్ లు సుజికి ఆక్సెస్ బైక్ పై సీలేరు వైపు నుండి డొంకరాయి వైపుకు వస్తుండగా డొంకరాయి పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా సుజికీ యాక్సెస్ బైక్ డిక్కి లో రెండు కేజీలు ఉండటంతో, 10వేల రూపాయల విలువైన 2కేజీల గంజాయి, సుజీకి యాక్సెస్ బైక్ లను సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలు బాబు, సురేష్ లను  అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.అనంతరం మంగంపాడు వెైపు నుండి డొంకరాయి వైపుకి వస్తున్న ఆటోలో 3 ప్లాస్టిక్ బ్యాగ్ ల్లో 60 కేజీల గంజయి అక్రమంగా తరలిస్తున్న బర్రిగూడ గ్రామానికి చెందిన కిలో రాందాస్, తెలంగాణ రాష్ట్రం చిట్యాలకి చెందిన గోగ్రే కృష్ణ లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి, 3.30లక్షల రూపాయల విలువైన 60 కేజీల గంజాయిని , ఆటోలను సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలు రాందాస్, కృష్ణ లను రిమాండ్ కి తరలించారు.ఈ రెండు కేసుల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం సేకరించడంలో ముద్దాయిలు చాకచక్యంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్స్ కళ్యాణ్, ఐ శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాస్ గౌడ్,  కానిస్టేబుల్స్ పోసయ్య, గంగరాజులను ఎస్సై శివ కుమార్, సీఐ గజేంద్ర కుమార్ , చింతూరు అడిషనల్ ఎస్పీ  రాహుల్ మీనా  అభినందించారు.

About The Author: Admin