ఆర్వి నగర్ లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి:వైసిపి నాయకులు అరికట్ట అంజి 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 4:

IMG_20241104_085246
వైసిపి నాయకులు అరికట్ట అంజి

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం జీకే వీధి పంచాయతీలో ఆర్ వి నగర్ లో ఉన్న సచివాలయం 2 వద్ద తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసిపి నాయకులు అరికట్ట అంజి డిమాండ్ చేశారు.ఆర్వి నగర్ పరిసర ప్రాంత ప్రజలు అనేకమంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయించుకోవాల్సి ఉందని, గూడెం కొత్త వీధి వెళ్లి నమోదు చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కావున అధికారులు స్పందించి కొన్ని రోజులైనా ఆర్ వి నగర్ లో ఉన్నా సచివాలయం 2 వద్ద తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.