అర్హతను బట్టి అడ్మిషన్ ఇవ్వాలి

గంగవరం/ రంపచోడవరం, అల్లూరి జిల్లా.

 

 

 ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి  సూరజ్ గనోరే 



 ఏజెన్సీలోని  ప్రభుత్వ నిబంధన ప్రకారం  ఐదోవ తరగతి నుండి  ఇంటర్మీడియట్ వరకు  దరఖాస్తులు చేసుకున్న  గిరిజన విద్యార్థులకు వారి అర్హతను బట్టి  అడ్మిషన్స్ తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  సూరజ్ గానోరే సంబంధిత అధికారులను  ఆదేశించారు.                                  

సోమవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారి చాంబర్లో  గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తో,  అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల 
కన్వినర్ ప్రిన్సిపాల్స్  తో  కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులకు సకాలంలో అడ్మిషన్స్ ఏర్పాటు చేసీ రీ -ఓపెనింగ్ నాటికి విద్యార్ధులందరూ పాటశాలలు/కళాశాలకు వచ్చే  విధంగా చర్యలు చేపట్టాలని ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  సూరజ్ గానోర్ మాట్లాడుతూ ఏజెన్సీలోని  ఐటీడీఎ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో, ఏకలవ్య మోడల్ రెసిడెన్ స్కూల్ లలో, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలలో  ఈ సంవత్సరం ఐదవ తరగతి నుండి  ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నా వారిని  వారి అర్హతను బట్టి  సీట్లు కేటాయించాలని ఆయన అన్నారు. పాఠశాలలు / కళాశాలల  రీ ఓపెనింగ్ నాటికి  అన్ని  మౌలిక సదుపాయాలు  పక్కాగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పాఠశాలలో జాయిన్ అయిన  విద్యార్థుల తల్లిదండ్రులతో రీ ఓపెనింగ్ నాడు  పేరెంట్స్ మీటింగ్   నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు   ఆరోగ్యం పై ప్రత్యేక  దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలలో మరమ్మత్తులు, ఆర్వో   ప్లాట్లు మరమ్మత్తులు, అదనపు తరగతి గదులు కావాల్సి ఉన్నాయెడల  ప్రతిపాదనలు, డ్రైనేజీ కి సంబంధించిన సమస్యలు, కరెంటు మరమ్మత్తులు  తదితర  వాటిని  నివేదికలు తయారుచేసి  సమర్పించాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలలో  ఐదు సంవత్సరాల పైబడి ఒకే చోట  పనిచేయుచున్న టీచర్ల జాబితాను  తయారు చేసి సమర్పించాలని  ఆయన అన్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులను  దగ్గర్లో ఉన్న ఆశ్రమ   పాఠశాలలలో  జాయిన్ చేసుకోవాలని ఆయన అన్నారు.  గత సంవత్సరం ఏడో తరగతిలో సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నవి  ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని  ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్ని ఉన్నవి ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని  గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో , ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్  స్కూళ్లకు  నిత్యవసర వస్తువులు,  కాయగూరలు క్వాలిటీ గలవి సరఫరా చేసింది లేనిది  ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని  ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ప్రతి ఆశ్రమ  పాఠశాలలలో, గురుకుల పాఠశాలలో, గురుకుల జూనియర్ కాలేజీలలో, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్  స్కూల్ లలో  చదవబోయే విద్యార్థులకు  విద్యార్థుల ఆరోగ్యం పట్ల  ఎప్పటికప్పుడు పరిరక్షించే విధంగా  హెల్త్ కార్డులు  ఏర్పాటు చేయాలని  సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.                                  
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. అబు సలోము, గురుకుల కాలేజీల కన్వీనర్ జి. ప్రసూన , ఈ ఆర్ ఎం ఎస్  కన్వీనర్. ప్రిన్సిపాల్ యస్. రామకృష్ణ, అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రసాద్, రామ తులసి, గురుకులం సెల్ సిబ్బంది  యస్.  నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About The Author: D. RATNAM