అల్లూరి జిల్లా కేంద్రంగా నర్సీపట్నం పెడితే ఉద్యమానికి సిద్ధం:అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వర రాజు  

స్టాప్ రిపోర్టర్ పాడేరు,పెన్ పవర్,అక్టోబర్ 8: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా నర్సీపట్నం ని ఏర్పాటు చేస్తే ఉద్యమానికి సిద్ధమవుతామని అల్లూరి సీతారామరాజు జిల్లా వైసిపి అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాను ప్రకటించి, గిరిజన ప్రాంతంలోనే స్థానికంగానే జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటే గిరిజన ప్రాంత ప్రజలకు జిల్లా అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి వీలవుతుందని అలాగే ప్రజలు తమ సమస్యలను అందుబాటులో ఉన్న అధికారులకు చెప్పుకునే విధంగా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అని, అయితే ప్రస్తుతం అల్లూరి జిల్లా కేంద్రంను నర్సీపట్నంకు మారుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని, జిల్లా నర్సీపట్నం కేంద్రంగా తరలిస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజలు,పలు సంఘాలు ఏకమై ఉద్యమం చేపడతామని విశ్వేశ్వర రాజు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందని ప్రాంతం, స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లయినా అభివృద్ధి నోచుకోని, వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం. అలాంటి ప్రాంతం ఒక జిల్లాగా ఏర్పడి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇదే అల్లూరి జిల్లానీ నర్సీపట్నం కేంద్రంగా కొనసాగిస్తే ఊరుకునేది లేదు అని ఖరాఖండీగా చెప్పారు.గిరిజన ప్రాంత ప్రజలు బాగుపడటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు అని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అల్లూరి జిల్లా కేంద్రంగా మైదాన ప్రాంతమైన నర్సీపట్నం కి తరలిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ కూతంగి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగళన్న దొర, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు గబ్బడ చిట్టిబాబు, ఏఎంసీ సభ్యులు లకే రామసత్యవతి, ఎంపీటీసీలు రామకృష్ణ పాత్రుడు, సల్ల చిట్టెమ్మ, సర్పంచులు వనుగు బసవన్న దొర, కుర్రబోయిన సన్ని బాబు, వంతల రాంబాబు,మాజీ సర్పంచ్ శరభ సూర్యనారాయణ, మినుముల కన్నపాత్రుడు, పాంగి నాగరాజు, సీనియర్ నాయకులు బోనంగి వెంకటరమణ, డిపి రాంబాబు, వి.నరేష్, బూర మహేష్, పాంగి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.