బోటింగ్ షికారు పర్యాటకులకు ఎంతో ఉత్సాహపరుస్తుంది:తాజంగి రిజర్వాయర్లో బోట్ షికారు చేసిన ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వర రాజు 

స్టాఫ్ రిపోర్టర్,చింతపల్లి,పెన్ పవర్ అక్టోబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు ఆదివారం చింతపల్లి మండలంలో ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన లంబసింగి, తాజంగి ప్రాంతాలలో పర్యటించారు.తాజంగి రిజర్వాయర్ లో బోట్ షికారు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఊటీ కాశ్మీర్ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి,తాజంగి రిజర్వాయర్ ఎప్పుడు పర్యాటకులతో కిటకిట లాడుతూ ఉందని,తాజంగి అందాలను తిలకించే పర్యాటకులు బోటు షికారు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఒకటే బోటు ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. మంచి ఆదాయాన్ని అందిస్తున్న బోటింగ్ సేవలు పెంచి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బోటింగ్ సేవలు పర్యాటకులను మరింత ఉత్సాపరుస్తుందని అన్నారు. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి పర్యాటక ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని, మరో బోటు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

 

రిపోర్టర్: మాదిరి చంటిబాబు  IMG-20241020-WA0891

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.