స్టాఫ్ రిపోర్టర్,చింతపల్లి,పెన్ పవర్ అక్టోబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వర రాజు ఆదివారం చింతపల్లి మండలంలో ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన లంబసింగి, తాజంగి ప్రాంతాలలో పర్యటించారు.తాజంగి రిజర్వాయర్ లో బోట్ షికారు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఊటీ కాశ్మీర్ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి,తాజంగి రిజర్వాయర్ ఎప్పుడు పర్యాటకులతో కిటకిట లాడుతూ ఉందని,తాజంగి అందాలను తిలకించే పర్యాటకులు బోటు షికారు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఒకటే బోటు ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. మంచి ఆదాయాన్ని అందిస్తున్న బోటింగ్ సేవలు పెంచి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బోటింగ్ సేవలు పర్యాటకులను మరింత ఉత్సాపరుస్తుందని అన్నారు. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి పర్యాటక ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని, మరో బోటు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.
రిపోర్టర్: మాదిరి చంటిబాబు