గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు02: విధి విచిత్రమో లేక ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం తెలియదు గాని గూడెం కొత్తవీధి మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ పథకం వెలుగు కార్యాలయాలకు వెళ్లే రహదారి బురద మయంగా మారి ఈ కార్యాలయాలకు వివిధ పనుల కోసం వెళు తున్న గిరిజనులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రతి గ్రామానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రహదారులకు నిధులు ఇచ్చే ఆ శాఖ ఉండే భవనానికి కనీసం సిసి రహదారి లేకపోవడం విధివిచిత్రం.అధికారులు పక్కనే తిరుగుతున్న కనీసం ఈ రహదారిని పట్టించుకోకపోవడం మరీ విచిత్రం. పక్కనే రెవెన్యూ ఎంపీడీవో వంటి కార్యాలయాలు ఉన్న ఈ రహదారి గూర్చి ఎ ఒక్కరూ ఇప్పటివరకు పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకొని జాతీయ ఉపాధి హామీ పథకం వెలుగు కార్యాలయాలకు వెళ్లే రహదారిని సిసి రహదారిగా నిర్మించాలని పలువురు కోరుతున్నారు.