కోట్లగరువు ఎంపీపీ పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వర రాజు  

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 28: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంతడా పల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్,పాడేరు ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వర రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మొక్కలు నాటి విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన భవన నిర్మాణంతో విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఉత్సాహం పెంచుతుందని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, చిన్నతనం నుండి కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లితండ్రుల ఆశయాలు నెరవేర్చి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాలల సమస్యలను గురించి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమాల ద్వారా చాలావరకు కొత్త స్కూలు భవనాలు మరియు మరమ్మత్తులు చేసి పాఠశాలలను సుందరి కరంగా తీర్చిదిద్ది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉందని అన్నారు. అలాగే కొన్ని మార్పుల గ్రామాలలో పాఠశాలలు పాతబడిపోయి అధ్వానంగా తయారయ్యాయని వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదెల రవణమ్మ, ఎంపీపీ సోనారి రత్నాకుమారి,వైసిపి మండల అధ్యక్షుడు సిదరీ రాంబాబు,వైస్ ఎంపీపీ కుంతురు కనకాలమ్మ, మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సరస్వతి దేవి, చల్లంగి విశ్వప్రసాద్, ఎంపీడీవో కే.సాయి నవీన్,సర్పంచులు దూసురు సన్యాసిరావు,సీనియర్ నాయకులు శరభ సూర్యనారాయణ,మినుముల కన్నపాత్రుడు,పాంగి నాగరాజు,ఎస్ దశ మూర్తి,లకే రామసత్యవతి, ఊర్వసి రాణి, ఎం.IMG-20240828-WA0701 సత్యనారాయణ,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.