మాజీ సర్పంచ్ లక్మి మృతీ పార్టీకి తీరని లోటు 

👉🏻కుటుంబానికీ బియ్యం, నిత్యవసర వస్తువులు, ఆర్థిక సహాయం అందజేత.

👉🏻వైస్ ఎంపీపీ సిరగం భాగ్యవతి, వైసిపి నాయకులు.

ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 12.:మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీ మాజీ సర్పంచ్ కొర్ర లక్మి మరణం వైసీపీ పార్టీకి తీరని లోటని వైస్ ఎంపీపీ సిరగాం భాగ్యవతి అన్నారు. ఆమె వైసీపీ శ్రేణులతో కలసి శనివారం తుమిడిపుట్టు గ్రామానికి చేరుకుని లక్మి కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. లక్మి చిత్రపటాని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ.. లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ గా లక్మి ఎన్నుకోబడి పంచాయతీ అభివృద్ధికి కృషీ చేశారని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే గొప్ప మనసున్న వ్యక్తియని, ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందడం బాధాకరం అన్నారు. లక్మి భార్య పార్వతికు, కుమారుడు సింహాద్రికు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సాదురం, దేవా, స్థానిక నాయకులు వెంకటరావు, సీతారాం, నాగేష్ తదితరులు పాల్గొన్నా

రు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.