స్టాప్ రిపోర్టర్ పాడేరు/ చింతపల్లి,జులై18 పెన్ పవర్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి జిసిసి కార్యాలయం వద్ద గ్యాస్ కార్యాలయంలో గ్యాస్ ఈ కేవైసీ కొరకు గ్యాస్ లబ్ధిదారులు ఉదయం నుండే క్యూ లైన్ లో నుంచొని ఎదురుచూస్తున్నారు. కార్యాలయం తెరిసే సమయానికన్న ముందే వచ్చి లబ్ధిదారులు క్యూలో నించొని ఉంటున్నారు. ప్రభుత్వం గ్యాస్ లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించడంతో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి అని లబ్ధిదారులు ఆశగా ఈకేవైసీ చేయించుకుంటున్నారు.గ్యాస్ ఈ కేవైసీకి తుది గడువు అయిపోతుందోమో అన్నా భయంతో దూర ప్రాంతాల నుండి ప్రజలు ఉదయకాలనే వచ్చి గ్యాస్ కార్యాలయంలో వేచి చూస్తున్నారు.
గ్యాస్ ఈ కేవైసీ పంచాయతీ కేంద్రాల్లో, సచివాలయాల్లో కూడా చేయాలని,దీనివల్ల రద్దీ తగ్గి లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవటానికి అవకాశం ఉంటుందని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.